ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ షురూ.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!


Wed,January 3, 2018 02:54 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ 2018ను ఇవాళ ప్రారంభించింది. ఈ నెల 5వ తేదీ శుక్రవారం వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీలకు చెందిన ఫోన్లపై భారీ డిస్కౌంట్లతోపాటు పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న మొబైల్స్ బొనాంజా సేల్‌లో కేవలం రూ.99లకే బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్‌ను అందిస్తున్నారు. అలాగే ఐఫోన్ 8 భారీ డిస్కౌంట్‌తో రూ.54,999 ధరకే లభిస్తున్నది. షియోమీ ఎంఐ ఎ1 రూ.12,999 ధరకు, పిక్సల్ 2 రూ.39,999కు, మోటో జీ5 ప్లస్ రూ.9,999కు, రెడ్‌మీ నోట్ 4 రూ.10,999కు, లెనోవో కె5 నోట్ రూ.11,481కు, శాంసంగ్ ఆన్ మ్యాక్స్ రూ.13,900 ధరకు, ఒప్పో ఎఫ్3 ప్లస్ రూ.17,990కి, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.26,990 కి, మోటో సి ప్లస్ రూ.5,999కు, లెనోవో కె8 ప్లస్ రూ.8,981 ధరకు లభిస్తున్నాయి. ఇవే కాకుండా పలు ఇతర స్మార్ట్‌ఫోన్లపై కూడా రాయితీలు, ఆఫర్లు లభిస్తున్నాయి.

3013

More News

VIRAL NEWS