ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 20 నుంచి రిప‌బ్లిక్ డే సేల్


Wed,January 16, 2019 11:55 AM

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న వెబ్‌సైట్‌లో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వ‌ర‌కు రిప‌బ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తున్న‌ది. ఇందులో భాగంగా ప‌లు ఉత్ప‌త్తుల‌పై అనేక ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న‌ది. సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుల‌తో ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే అద‌నంగా 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తారు. అలాగే ప‌లు ఉత్ప‌త్తుల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందివ్వ‌నున్నారు. సేల్‌లో భాగంగా మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లు, టీవీల‌పై బ్లాక్ బ‌స్ట‌ర్ డీల్స్‌ను అందివ్వ‌నున్నారు. ఇక ప్ర‌తి 8 గంట‌ల‌కు ఒక‌సారి ర‌ష్ అవ‌ర్స్ ఎక్స్‌ట్రా డిస్కౌంట్ల‌ను అందిస్తారు. సేల్‌లో టీవీలు, అప్ల‌యెన్సెస్‌పై 75 శాతం వ‌ర‌కు, ఎల‌క్ట్రానిక్స్‌, యాక్స‌స‌రీల‌పై 80 శాతం వ‌ర‌కు, ఇత‌ర బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌పై 70 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందివ్వ‌నున్నారు.

2277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles