వినియోగ‌దారుడికి ఒళ్లు మండింది.. ఫ్లిప్ కార్ట్ ఫైన్ క‌ట్టింది..!


Tue,March 28, 2017 04:32 PM

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ కు ఫైన్ పడింది. ఫైన్ అంటే ఎన్నో కోట్లు, లక్షల రూపాయలు కాదు లెండి. కేవలం రూ.15వేలు, అంతే..! ఓ వినియోగదారుడికి నాసిరకం ఫోన్ చార్జర్‌ను అమ్మినందుకు గాను అతనికి ఫ్లిప్‌కార్ట్ ఆ మొత్తం జరిమానాను చెల్లించనుంది. ఈ మేరకు వినియోగదారుల ఫోరం ఫ్లిప్‌కార్ట్‌కు ఆదేశాలు జారీ చేసింది. సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే...

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ అక్ ఇర్ఫానీ ఈ ఏడాది జనవరిలో ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఓ స్మార్ట్‌ఫోన్ చార్జర్‌ను కొనుగోలు చేశాడు. దాని ధర రూ.259. అయితే ఆ చార్జర్‌తో ఫోన్‌కు చార్జింగ్ పెట్టగానే ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ఈ క్రమంలో ఫోన్ లోపలి భాగం మొత్తం షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయింది. దీంతో ఫోన్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. అయితే ఈ విషయంపై ఇర్ఫానీ ఫ్లిప్‌కార్ట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫ్లిప్‌కార్ట్ ఆ ఫిర్యాదుకు స్పందించి కావాలంటే చార్జర్‌ను మారుస్తామని, కానీ ఫోన్ కాలిపోయినందుకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఆ సమాధానం విన్న ఇర్ఫానీకి ఒళ్లు మండిపోయింది. వెంటనే ఈ విషయంపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

వినియోగదారుల ఫోరంలో ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు ఏమని వాదించారంటే.. తాము అమ్మేవారికి, కొనేవారికి నడుమ మధ్య వర్తిత్వం మాత్రమే చేస్తామని, సాధారణంగా తమ వెబ్‌సైట్‌లో విక్రయించే వస్తువులన్నీ నాణ్యమైనవే ఉంటాయని అన్నారు. అయినప్పటికీ ఫోరం ఫ్లిప్‌కార్ట్ వాదనతో సంతృప్తి చెందలేదు. బాధితుడికి కొత్త చార్జర్ ఇవ్వడంతోపాటు అతని ఫోన్‌కు విలువైన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ ఇర్ఫానీకి అతని ఫోన్ ఖరీదు రూ.15వేలను ఫైన్‌గా చెల్లించింది.

39869
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles