స్టూడెంట్లకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ప్లస్ మెంబర్‌షిప్ ఉచితం..


Tue,December 3, 2019 12:17 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్టూడెంట్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ను స్టూడెంట్లకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అందుకుగాను స్టూడెంట్లు ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో తమ కాలేజ్ ఐడీ ప్రూఫ్, ఇతర వివరాలను ఎంటర్ చేసి సదరు మెంబర్‌షిప్‌కు అప్లయి చేయాలి. దీంతో వెంటనే కన్ఫర్మేషన్ మెయిల్, మెసేజ్ వస్తాయి. ఆ తరువాత స్టూడెంట్లు తమ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ను ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ మెంబర్‌షిప్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులు కొనే ప్రొడక్ట్‌లను ఉచితంగా, వేగంగా డెలివరీ అందుకోవచ్చు. అలాగే ప్రత్యేక సేల్‌లు నిర్వహించినప్పుడు సాధారణ యూజర్ల కన్నా ముందుగానే ప్లస్ మెంబర్లకు సేల్‌లు అందుబాటులోకి వస్తాయి. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో రూ.100 విలువైన వస్తువును కొనుగోలు చేస్తే 4 సూపర్ కాయిన్స్ ఇస్తారు. అలా కాయిన్స్ జమ అయ్యాక నిర్దిష్ట మొత్తంలో కాయిన్స్‌కు ఫ్లిప్‌కార్ట్ సదరు ప్లస్ మెంబర్‌షిప్‌ను మళ్లీ రెన్యువల్ చేస్తుంది.

2028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles