ఫ్లిప్‌కార్ట్‌లో రేపటి నుంచే మొబైల్స్ బొనాంజా సేల్


Tue,December 25, 2018 10:32 AM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో రేపటి నుంచి మొబైల్స్ బొనాంజా సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ నెల 29వ తేదీ వరకు జరగనున్న ఈ సేల్‌లో భాగంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందివ్వనున్నారు. పలు ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందివ్వడంతోపాటు కేవలం రూ.99 కే బై బ్యాక్ గ్యారంటీని ఇవ్వనున్నారు. సేల్‌లో భాగంగా రియల్ మి 2 ప్రొ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.1వేయి తగ్గింపుతో రూ.12,990 ధరకు ఇవ్వనున్నారు. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన మిగిలిన వేరియెంట్లపై కూడా రూ.1వేయి తగ్గింపును ఇస్తారు. ఇక సేల్‌లో హానర్ 9ఎన్ (3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) వేరియెంట్ రూ.11,999 ధరకు, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.13,999 ధరకు, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.17,999 ధరకు లభించనున్నాయి. ఇవే కాకుండా హానర్ 7ఎ, 7ఎస్, నోకియా 5.1 ప్లస్, నోకియా 6.1 ప్లస్, అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1, మోటోరోలా వన్ పవర్, గెలాక్సీ ఆన్6, ఆన్8 ఫోన్లు కూడా తక్కువ ధరలకే లభ్యం కానున్నాయి.

2766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles