ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్ షురూ..!


Wed,October 24, 2018 03:46 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దీపావళి పండుగ సందర్భంగా ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్‌ను ఇవాళ ప్రారంభించింది. బిగ్ బిలియన్ డేస్‌కు వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీలు, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. కాగా ఈ సేల్ ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ రూ.5వేల తగ్గింపు ధరతో రూ.40,999 ధరకు లభిస్తున్నది. అలాగే అసుస్ జెన్‌ఫోన్ 5జడ్ 8జీబీ+256 జీబీ రూ.31,999 ధరకు, గెలాక్సీ ఎస్8, రూ.32,990 ధరకు, అసుస్ జెన్‌ఫోన్ 5జడ్ 6జీబీ+128జీబీ రూ.27,999 ధరకు లభిస్తున్నాయి. వీటితోపాటు అసుస్ జెన్‌ఫోన్ 6జీబీ+64జీబీ రూ.24,999 ధరకు, హానర్ 10 రూ.24,999కు, రెడ్‌మీ నోట్ 5 ప్రొ 4జీబీ+64జీబీ రూ.12,999కు, అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 4జీబీ+64 జీబీ రూ.12,999 ధరకు, హానర్ 9ఎన్ 3జీబీ+32జీబీ రూ.11,999కు, అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 4జీబీ+64జీబీ రూ.10,999కు, మోటోఎక్స్4 3జీబీ ర్యామ్ రూ.10,999కు లభిస్తున్నాయి. వీటితోపాటు మోటో జీ6 ప్లే (రూ.10,999), నోకియా 5.1 ప్లస్ (రూ.10,499), హానర్ 9 లైట్ (రూ.9,999), అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 3జీబీ+32జీబీ (రూ.9,999), మోటో ఈ5 ప్లస్ (రూ.9,999), హానర్ 7ఎస్ (రూ.6,499) ఫోన్లు కూడా తక్కువ ధరలకే లభిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్ వాచ్‌లు, యాపిల్ ఐప్యాడ్, ఎక్స్‌బాక్స్ వన్ ఎస్, గూగుల్ హోం, గూగుల్ హోం మినీ, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, పవర్‌బ్యాంకులపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. పలు ప్రొడక్ట్స్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

2340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles