నవంబర్ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్


Mon,October 29, 2018 03:37 PM

బిగ్ బిలియన్ డేస్, ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్‌లతో వినియోగదారులకు భారీ ఎత్తున ఆఫర్లు, రాయితీలను అందించిన ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌కు సిద్ధమవుతున్నది. నవంబర్ 1వ తేదీ నుంచి దీపావళి సేల్‌ను నిర్వహిస్తున్నది. నవంబర్ 5వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో రియల్ మి 2 ప్రొ, రెడ్‌మీ నోట్ 5 ప్రొ, హానర్ 9ఎన్, లెనోవో ఎ5, లెనోవో కె9 ఫోన్లను తగ్గింపు ధరలకు విక్రయించనున్నారు. సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. అలాగే డెబిట్ కార్డు ఈఎంఐలు, క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను కూడా ఈ సేల్‌లో అందివ్వనున్నారు. అనేక రకాల ప్రొడక్ట్స్‌పై బై బ్యాక్ గ్యారంటీ, కంప్లీట్ ప్రొటెక్షన్ ప్లాన్‌లను అందివ్వనున్నారు. ఇవే కాకుండా మరెన్నో ఆఫర్లు, రాయితీలను ఫ్లిప్‌కార్ట్ తన దీపావళి సేల్‌లో అందివ్వనుంది.

2939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles