ఎల్లుండి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్


Tue,December 4, 2018 11:27 AM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో ఎల్లుండి నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమయ్యే ఈ సేల్ ఈ నెల 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా అనేక రకాల ప్రొడక్ట్స్‌పై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందివ్వనున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే పలు ప్రొడక్ట్స్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. దీంతోపాటు పోకో ఎఫ్1, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్, రియల్ మి సి1, అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1, హానర్ 9ఎన్, రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫోన్లపై డిస్కౌంట్లను అందివ్వనున్నారు.

2126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles