అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్..!


Mon,August 6, 2018 01:40 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు బిగ్ ఫ్రీడం సేల్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా అనేక రకాల ప్రొడక్ట్స్‌పై భారీ రాయితీలు, కళ్లు చెరిదే డీల్స్, ఆఫర్లు అందివ్వనున్నారు. మరోవైపు అమెజాన్ ఇండియా కూడా ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఫ్రీడం సేల్‌ను నిర్వహించనుంది. ఇందుకు పోటీగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్‌లో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. దీంతోపాటు గంట గంటకు ఎక్స్‌పైర్ అయిపోయే డీల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. ఇక షియోమీ, శాంసంగ్, యాపిల్ తదితర కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లతోపాటు డెల్, గూగుల్ తదితర కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్‌పై కూడా భారీ రాయితీలను ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్ సన్నద్ధమైంది. కాగా ఫ్లిప్‌కార్ట్ తాను నిర్వహించబోయే సేల్‌లో ఇంకా ఎలాంటి ఆఫర్లను అందిస్తుందో ఆ వివరాలను మాత్రం పూర్తిగా వెల్లడించలేదు. మరో ఒకటి రెండు రోజుల్లో పూర్తి ఆఫర్ల వివరాలను తెలియజేసే అవకాశం ఉంది.

2696

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles