ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాలీ సేల్.. ఫోన్లు, టీవీలపై తగ్గింపు ధరలు..!


Mon,October 7, 2019 12:56 PM

దీపావళి పండుగ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విషయం విదితమే. కాగా అటు ఫ్లిప్‌కార్ట్ కూడా దీపావళికి ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్ జరగనుంది. అందులో భాగంగా ఫోన్లు, టీవీలతోపాటు వియరబుల్స్, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు తదితర ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలను అందివ్వనున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌లో షియోమీ, వివో, రియల్‌మి కంపెనీలకు చెందిన ఫోన్లతోపాటు టీవీలపై ఆకట్టుకునే ఆఫర్లను అందివ్వన్నునారు. అలాగే ఎస్‌బీఐ కార్డులతో ఆయా వస్తువులను కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు పలు ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చు.

4545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles