ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాలీ సేల్ షురూ..!


Thu,November 1, 2018 11:34 AM

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న సైట్‌లో బిగ్ దివాలీ సేల్ ను ఇవాళ ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 5వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, యాక్స‌స‌రీలు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు త‌దిత‌ర అనేక ర‌కాల ప్రొడ‌క్ట్స్‌పై ఆక‌ట్టుకునే రాయితీలు, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తున్న ప‌లు ఫోన్లు ఇవే..


* గూగుల్ పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్ ధ‌ర రూ.40,999 (రూ.5వేలు త‌గ్గింది)
* అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్ 8జీబీ + 256 జీబీ - ధ‌ర రూ.31,999 (రూ.5వేలు త‌గ్గింది)
* శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 - రూ.32,990 (రూ.12వేలు త‌గ్గింది)
* అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్ 6జీబీ+128 జీబీ - ధర రూ.27,999 (రూ.5వేలు త‌గ్గింది)
* పోకో ఎఫ్1 8జీబీ + 256 జీబీ - రూ.27,999 (రూ.2వేలు త‌గ్గింది)
* హానర్ 10 - రూ.24,999 (రూ.11వేలు త‌గ్గింది)
* నోకియా 6.1 ప్ల‌స్ - రూ.14,999 (రూ.1వేయి త‌గ్గింది)
* షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రొ 4జీబీ + 64జీబీ - రూ.12,999 (రూ.2వేలు త‌గ్గింది)
* హాన‌ర్ 9ఎన్ 3జీబీ + 32 జీబీ - రూ.11,999 (రూ.2వేలు త‌గ్గింది)
* మోటో జీ6 ప్లే - రూ.10,999 (రూ.1వేయి తగ్గింది)
* నోకియా 5.1 ప్ల‌స్ - రూ.10,499 (రూ.500 త‌గ్గింది)

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 3 స్మార్ట్‌వాచ్‌లు రూ.23,900 ప్రారంభ ధ‌ర‌కే ల‌భిస్తుండ‌గా, ఎక్స్‌బాక్స్ వ‌న్ ఎస్ 1టీబీ క‌న్సోల్ రూ.21,990 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. అలాగే ల్యాప్‌టాప్‌లు, ప‌వ‌ర్‌బ్యాంక్‌లు, ఎల్ఈడీ టీవీలు, హార్డ్ డిస్క్‌ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను ఇస్తున్నారు. సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేస్తే అద‌నంగా మ‌రో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు.

2483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles