ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ షురూ.. భారీ తగ్గింపు ధరలకు స్మార్ట్‌ఫోన్లు..!


Wed,October 10, 2018 10:50 AM

దసరా పండుగ నేపథ్యంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అన్నీ ప్రత్యేక సేల్‌లను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇవాళ ప్రారంభం కాగా, మరో వైపు ఫ్లిప్‌కార్ట్ కూడా తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఇవాళే ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుండగా, ఇందులో అనేక రకాల ఉత్పత్తులపై కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఉన్న ఆఫర్లివే...

* హానర్ 9ఎన్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ - రూ.9,999 (రూ.4వేల తగ్గింపు)
* హానర్ 9ఎన్ 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ - రూ.11,999 (రూ.3వేల తగ్గింపు)
* హానర్ 10 - రూ.24,999 (అసలు ధర రూ.35,999)
* హానర్ 8 ప్రొ - రూ.19,999
* హానర్ 9ఐ - రూ.12,999
* హానర్ 9 లైట్ - రూ.11,999
* హానర్ 7ఎ - రూ.7,999
* హానర్ 7ఎస్ - రూ.6,499
* శాంసంగ్ గెలాక్సీ ఎస్8 - రూ.29,990 (రూ.16వేలు తగ్గింది)
* గెలాక్సీ ఆన్6 - రూ.11,990
* గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ - రూ.9,990
* గెలాక్సీ జె3 ప్రొ - రూ.6,190 (అసలు ధర రూ.8,490)
* మోటోరోలా మోటో జడ్2 ప్లే 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ - రూ.9,999 (అసలు ధర రూ.27,999)
* మోటో జడ్2 ఫోర్స్ - రూ.17,500 (అసలు ధర రూ.34,999)
* అసుస్ జెన్‌ఫోన్ 5జడ్ - రూ.24,999 (రూ.5వేలు తగ్గింది)
* జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 అన్ని వేరియెంట్లపై రూ.1వేయి తగ్గింపు
* నోకియా 6.1 ప్లస్ - రూ.14,999 (రూ.1వేయి తగ్గింది)

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా కొత్త ఫోన్లు అయిన రియల్‌మి సి1, నోకియా 5.1 ప్లస్ ఫోన్లను రేపు మధ్యాహ్నం 12 గంటలకు విక్రయించనున్నారు. రియల్ మి సి1 ధర రూ.6,999 గా ఉంది. నోకియా 5.1 ప్లస్ రూ.10,999 కు లభిస్తున్నది. ఇక ఇవే కాకుండా అనేక రకాల ఇతర ప్రొడక్ట్స్‌పై కూడా ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్నది.

2770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles