అక్టోబర్ 10న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ షురూ..!


Tue,September 25, 2018 02:55 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అక్టోబర్ 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఇవాళ ఒక ప్రకటనను విడుదల చేసింది. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా విజయవంతంగా ఈ సేల్‌ను నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌కు ఇది 5వ ఎడిషన్ సేల్ కానుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్యాషన్, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, ఫర్నిచర్ తదితర వస్తువులపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందివ్వనుంది. అనేక ప్రొడక్ట్స్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందివ్వనున్నారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొంటే అదనపు డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. ఈ క్రమంలో మాస్టర్‌కార్డ్ యూజర్లకు ఆకట్టుకునే రివార్డులను అందిస్తారు.

అక్టోబర్ 10వ తేదీన ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫ్యాషన్, టీవీలు, అప్లయెన్సెస్, హోమ్, ఫర్నిచర్, బ్యూటీ, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్‌పై ఆఫర్లను ఇస్తారు. అలాగే అక్టోబర్ 11 నుంచి సేల్‌లో భాగంగా కొనే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లను ఇస్తారు. కాగా ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ సేల్‌ను నిర్వహించనుంది. కానీ ఆ సంస్థ ఇంకా సేల్ తేదీలను ప్రకటించలేదు.

1716

More News

VIRAL NEWS