ఫ్లిప్‌కార్ట్‌లో మరో పండుగ సేల్ ఎప్పుడంటే..


Fri,October 19, 2018 01:29 PM

ఇండియా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో పండుగ సేల్ తేదీలను ప్రకటించింది. ఈసారి ఫెస్టివ్ ధమాకా డేస్ పేరుతో ఈ సేల్ కస్టమర్ల ముందుకు రానుంది. అక్టోబర్ 24 నుంచి 27 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. బిగ్ బిలియన్ డేస్ పేరుతో గత వారం ఓ సేల్‌ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. వచ్చే వారమే మరో సేల్ నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని ప్రముఖ ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయని సంస్థ వెల్లడించింది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రికార్డు స్థాయిలో మొబైల్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ విక్రయించింది. అటు అమెజాన్ కూడా ఇప్పటికే వచ్చే వారం నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లాగా కాకుండా ఈ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్‌లో తొలి రోజు నుంచే అన్ని ఉత్పత్తులపై సేల్ ప్రారంభం కానుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఈ ఆఫర్లు అక్టోబర్ 23 రాత్రి 9 గంటల నుంచే అందుబాటులోకి వస్తాయి. ఈ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్‌తో చేతులు కలిపిన ఫ్లిప్‌కార్ట్ ఆ బ్యాంక్ కార్డులపై ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు టీవీలు, ఇతర గృహోపకరణాలపై 70 శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

2458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles