కొత్త ఫిట్‌నెస్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసిన ఫిట్‌బిట్


Wed,May 9, 2018 03:36 PM

ఫిట్‌నెస్ పరికరాల తయారీ సంస్థ ఫిట్‌బిట్ తన నూతన ఫిట్‌నెస్ స్మార్ట్‌వాచ్ 'వెర్సా'ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.19,999 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ వాచ్‌లో 1.34 ఇంచ్ టచ్ స్క్రీన్ కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, వాటర్ రెసిస్టెంట్, హార్ట్ రేట్ మానిటర్, ఎస్‌పీఓ2 సెన్సార్, వైఫై, బ్లూటూత్ 4.0, ఎన్‌ఎఫ్‌సీ, ఎక్సర్‌సైజ్ ట్రాకర్, జీపీఎస్, 2.5 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 145 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌కు చెందిన స్పెషల్ ఎడిషన్ రూ.21,999 ధరకు లభిస్తున్నది. దీనికి గాను పలు యాక్ససరీలను కూడా అందిస్తున్నారు. వాటి ధరలు రూ.2,499 నుంచి రూ.8,999 మధ్య ఉన్నాయి.

1830

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles