ఫియో నుంచి 'ఆండ్రాయిడ్' ఆడియో ప్లేయర్...


Wed,January 27, 2016 04:49 PM

చైనాకు చెందిన ఆడియో పరికరాల తయారీదారు ఫియో 'ఫియో ఎక్స్7' పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ఆధారిత హై రిజల్యూషన్ ఆడియో ప్లేయర్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.42,299 ధరకు ఈ డివైస్ వినియోగదారులకు లభిస్తోంది.

ఇందులో ఆడియో ప్రాసెసింగ్ కోసం క్వాడ్‌కోర్ రాక్‌చిప్‌ను ఏర్పాటు చేశారు. దీంట్లో 4 ఇంచుల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇది 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 1 జీబీ ర్యామ్ , 32 జీబీ ఇంటర్నల్ మెమోరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. flac, wav, alac, mp3, ogg, dsd, dxd, pcm వంటి ఫైల్ ఫార్మాట్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైఫై, బ్లూటూత్ కూడా ఉంది.

9974

More News

VIRAL NEWS