రూ.6,990కి ఫియో ఎం3కె పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్


Tue,September 11, 2018 05:39 PM

ఫియో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సంస్థ ఎం3కె పోర్టబుల్ హై రిజల్యూషన్ లాస్‌లెస్ మ్యూజిక్ ప్లేయర్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 2.0 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి టచ్ ప్యాడ్‌ను అమర్చారు. ఇందులో పాటలను ప్లే/పాజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్, నెక్ట్స్ ట్రాక్‌ను ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. అలాగే కన్‌ఫర్మేషన్, బ్యాక్, మెనూ కీలను అమర్చారు. ఈ మ్యూజిక్ ప్లేయర్ పూర్తిగా అల్యూమినియం బాడీని కలిగి ఉంది. ఇక దీనికి టెంపర్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కల్పించారు. అందువల్ల మ్యూజిక్ ప్లేయర్‌పై స్క్రాచ్‌లు పడకుండా ఉంటాయి.

ఈ మ్యూజిక్ ప్లేయర్‌ను ఫుల్ చార్జింగ్ చేసుకుంటే 24 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పాటలు వినవచ్చు. అలాగే దీని స్టాండ్ బై టైం 38 రోజులుగా ఉంది. ఈ ప్లేయర్‌లో 2టీబీ వరకు కెపాసిటీ ఉన్న మైక్రో ఎస్‌డీ కార్డులను వేసుకోవచ్చు. ఫియో ఎం3కె మ్యూజిక్ ప్లేయర్ ధరను రూ.6,990 గా నిర్ణయించారు. అయితే ప్రీ ఆర్డర్ చేసే వారికి రూ.5,900 ధరకే ఈ ప్లేయర్ లభిస్తుంది. భారత మార్కెట్‌లో ఈ మ్యూజిక్ ప్లేయర్‌ను ఈ నెల 17వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

2164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles