ఫేస్‌బుక్ ఫొటోల‌ను ఇకపై గూగుల్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.!


Tue,December 3, 2019 10:47 AM

ప్రముఖ సోషల మీడియా సంస్థ ఫేస్‌బుక్ త్వరలో ఓ నూతన ఫీచర్‌ను తన యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఫేస్‌బుక్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసుకునే ఫొటోలను ఇకపై గూగుల్ ఫొటోస్‌కు ఆన్‌లైన్‌లోనే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ఫేస్‌బుక్ త్వరలో ఓ నూతన టూల్‌ను యూజర్లకు అందివ్వనుంది. ఆ టూల్ సహాయంతో ఫేస్‌బుక్‌లో ఉన్న ఫొటోలను యూజర్లు చాలా సులభంగా తమ తమ గూగుల్ ఫొటోస్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఐర్లాండ్‌లో పలు ఎంపిక చేసిన యూజర్లకు ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను ఇప్పటికే అందిస్తుండగా, త్వరలో ప్రపంచంలో ఉన్న అందరు ఫేస్‌బుక్ యూజర్లకూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. కాగా ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను తన డేటా ట్రాన్స్‌ఫర్ ప్రాజెక్టులో భాగంగా డెవలప్ చేస్తున్నట్లు తెలిపింది.

523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles