ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్..!


Tue,November 21, 2017 05:13 PM

ఫేస్‌బుక్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో అందులో మరో పవర్‌ఫుల్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. 'వాచ్ (Watch)' పేరిట వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో ఉన్న ఫేస్‌బుక్ యూజర్లకు లభిస్తున్నది. త్వరలోనే భారత్‌లో దీన్ని లాంచ్ చేయనున్నారు.

దేశంలో ఈ ఏడాది జూలై వరకు ఫేస్‌బుక్ లెక్కల ప్రకారం ఆ సంస్థ సేవల్ని వాడుతున్న యూజర్లు 24.1 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. ఈ క్రమంలోనే అంత భారీ మార్కెట్ ఉన్నందునే ఫేస్‌బుక్ వీడియో స్ట్రీమింగ్ సేవలను ప్రవేశపెడుతున్నది. యూజర్లకు బాగా నచ్చే అంశాలు కలిగిన వీడియో షోలను స్ట్రీమింగ్ సేవల్లో ఫేస్‌బుక్ అందివ్వనుంది. లైఫ్ స్టైల్, కామెడీ, చిల్డ్రన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి జానర్‌లకు సంబంధించిన వీడియోలను స్ట్రీమింగ్ సేవల ద్వారా అందించాలనే యోచనలో ఫేస్‌బుక్ ఉంది. అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది ఫేస్‌బుక్ వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే అందుబాటులోకి రావచ్చని తెలిసింది.

2757

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018