ఫేస్‌బుక్‌లో త్వరలో రానున్న న్యూస్ ఫీచర్..?


Sun,August 11, 2019 04:14 PM

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తున్న విషయం విదితమే. అయితే త్వరలోనే మరో నూతన ఫీచర్‌ను ఫేస్‌బుక్ తన యూజర్లకు అందివ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులలో చాలా మంది మొబైల్ ఫోన్స్‌లో వార్తలను చదువుతున్నారు. దీంతో ఫేస్‌బుక్ కూడా త్వరలోన తన యాప్‌లో న్యూస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుందని తెలిసింది.

ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో న్యూస్ ఫీచర్‌ను ఆ సంస్థ అందుబాటులోకి తెస్తుందని సమాచారం. కాగా ఈ ఫీచర్‌ను మొదట అమెరికాలోని ఫేస్‌బుక్ యూజర్లకు అందిస్తారని తెలిసింది. ఇందుకు గాను ఫేస్‌బుక్ అక్కడి ప్రముఖ వార్తా సంస్థలతో ప్రస్తుతం ఒప్పందాలు చేసుకునే దిశగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది. దీనికోసం ఆయా సంస్థలకు ఫేస్‌బుక్ దాదాపుగా 3 మిలియన్ డాలర్లను చెల్లించి వార్తలను అందించేందుకు కావల్సిన లైసెన్స్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఫీచర్‌పై గతంలోనే ప్రకటించారు. దీంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యూస్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని తెలిసింది. మరి దీనిపై ఫేస్‌బుక్ అధికారిక ప్రకటనను ఎప్పుడు వెలువరిస్తుందో చూడాలి..!

1059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles