ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ అన్‌సెండ్ ఫీచ‌ర్‌.. ఇక అంద‌రికీ..!


Wed,February 6, 2019 05:00 PM

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో అన్‌సెండ్ ఫీచ‌ర్ ఇప్పుడు యూజ‌ర్లంద‌రికీ ల‌భిస్తున్న‌ది. గ‌త కొద్ది నెల‌ల కింద‌ట ఫేస్‌బుక్ ఈ ఫీచ‌ర్ గురించి ప్ర‌క‌టించ‌గా, ఇప్పుడిది అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో యూజ‌ర్లు ఎవ‌రైనా తాము అవ‌త‌లి వారికి పంపిన మెసేజ్‌ల‌ను వెంట‌నే డిలీట్ చేయ‌వ‌చ్చు. అయితే అందుకు గాను 10 నిమిషాల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉంటుంది. ఆ లోప‌లే మెసేజ్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్లంద‌రికీ ల‌భిస్తున్న‌ది.

1756

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles