ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వస్తున్న మరో అదిరిపోయే ఫీచర్..!


Thu,March 15, 2018 11:13 AM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో త్వరలో మరో అదిరిపోయే ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌లో యూజర్లు పంపుకునే ఫొటోలు, వీడియోలు నిర్దిష్ట కాల వ్యవధి ముగిశాక వాటంతట అవే చాటింగ్ విండోల నుంచి మాయమవుతాయి. అవి అదృశ్యమవుతాయి. మళ్లీ కనిపించవు. యూజర్లు ఒకరికొకరు పంపుకునే ఫొటోలు, వీడియోలు కొంత సమయం పాటు మాత్రమే చాటింగ్‌లో కనిపిస్తాయి. ఆ సమయం దాటాక అవి కనిపించవు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ అంతర్గతంగా పరిశీలిస్తుండగా అతి త్వరలో యూజర్లకు లభిస్తుంది. స్నాప్‌చాట్ యాప్‌లో ఈ తరహా ఫీచర్ లభిస్తుండగా దాని తరహాలోనే ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌లో డిసప్పియరింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇక దీంతోపాటు యాప్‌ను పూర్తిగా కొత్త లుక్‌తో డిజైన్ చేస్తున్నారు. దీంతో త్వరలో మనకు లభ్యం కానున్న ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ నయా లుక్‌తో, కొత్త ఫీచర్‌తో దర్శనమిస్తుంది.

2832

More News

VIRAL NEWS