ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్బుక్ మెసెంజర్లో త్వరలో డార్క్ మోడ్ పేరిట ఓ కొత్త ఫీచర్ లభ్యం కానుంది. పలు ఎంపిక చేసిన దేశాల యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ మొదట అందుబాటులోకి వస్తుంది. గతేడాది అక్టోబర్లోనే ఫేస్బుక్ ఈ ఫీచర్ గురించి ప్రకటన చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కాగా ప్రస్తుతం ఫేస్బుక్ ఈ ఫీచర్ను అంతర్గతంగా పరీక్షిస్తున్నది. అనంతరం యూజర్లకు పూర్తి స్థాయిలో ఈ ఫీచర్ అప్డేట్ను ఇస్తారు. డార్క్ మోడ్ ఫీచర్ వల్ల రాత్రి పూట, కాంతి అంతగా లేని ప్రదేశాల్లో యూజర్లు స్మార్ట్ఫోన్ స్క్రీన్లను మరింత సౌకర్యవంతంగా చూడవచ్చు. దీని వల్ల తక్కువ కాంతి వెలువడుతుంది. కళ్లు సురక్షితంగా ఉంటాయి. ఇక ఫేస్బుక్ ఈ ఫీచర్ను మెసెంజర్లో ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందో వేచి చూడాలి.