ఇక ఫేస్‌బుక్ మెసెంజర్‌లోనూ అన్‌సెండ్ ఫీచర్


Thu,November 15, 2018 12:04 PM

ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అన్‌సెండ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ తరహాలోనే ఈ ఫీచర్ పనిచేస్తుంది. యూజర్ ఎఫ్‌బీ మెసెంజర్‌లో అవతలి యూజర్‌కు పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చు. అందుకు గాను మెసేజ్ పంపినప్పటి నుంచి 10 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఆలోగా మెసేజ్‌ను అన్‌సెండ్ చేయవచ్చు. మెసేజ్‌పై హోల్డ్ చేసి పట్టుకుంటే ఆప్షన్లలో రిమూవ్, రిమూవ్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్లు దర్శనమిస్తాయి. వాటిల్లో రిమూవ్ ఎంచుకుంటే ఆ మెసేజ్ డిలీట్ అవుతుంది. అయితే 10 నిమిషాలు దాటితే మాత్రం యూజర్లు తాము పంపిన మెసేజ్‌లను డిలీట్ చేసుకునేందుకు అవకాశం లేదు.

అయితే యూజర్లు అన్‌సెండ్ ఫీచర్ ద్వారా ఎఫ్‌బీ మెసెంజర్‌లో మెసేజ్‌లను డిలీట్ చేసినా ఫేస్‌బుక్ మాత్రం వాటిని ప్రైవేట్‌గా స్టోర్ చేసి పెడుతుంది. ప్రైవసీకి సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే ఆ మెసేజ్‌లను ఫేస్‌బుక్ రివ్యూ చేస్తుంది. ఇక ఎఫ్‌బీ మెసెంజర్‌లో ఈ అన్‌సెండ్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై కేవలం ఎంపిక చేసిన దేశాల యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పోలండ్, బొలివియా, కొలంబియా, లిథుయానా దేశ ఎఫ్‌బీ మెసెంజర్ యూజర్లకు మాత్రమే ఈ అన్‌సెండ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు.

994

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles