నూతన వీడియో యాప్‌ను లాంచ్ చేసిన ఫేస్‌బుక్


Mon,November 12, 2018 02:10 PM

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్.. లాస్సో పేరిట ఓ నూతన యాప్‌ను విడుదల చేసింది. ఇందులో యూజర్లు తక్కువ నిడివి ఉన్న వీడియోలను షేర్ చేసుకోవచ్చు. వాటిని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలకు పంపుకోవచ్చు. స్నాప్‌చాట్ తరహాలో ఈ యాప్ పనిచేస్తుంది. ఇందులో షార్ట్ ఫార్మాట్ వీడియోలను ఎడిట్ చేసుకునేందుకు పలు ప్రత్యేక ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్‌ను అందిస్తున్నారు. అయితే ఈ యాప్ ప్రస్తుతం యూఎస్‌లోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర దేశాల యూజర్లకు కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఈ యాప్ లభిస్తున్నది.

1681

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles