ఫేస్‌బుక్ ద్వారా మీకు డబ్బులొస్తాయ్..! ఎలాగో తెలుసా..?


Sun,November 19, 2017 05:29 PM

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తన యూజర్లకు మరో బ్రహ్మాండమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. 'మార్కెట్ ప్లేస్' అనబడే ఓ కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందివ్వనుంది. ఇప్పటికే ఈ ఫీచర్ పలు దేశాల్లో లభిస్తుండగా త్వరలో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లకు లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ ముంబైలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నది.

ఫేస్‌బుక్ ప్రవేశపెట్టనున్న మార్కెట్ ప్లేస్ ఫీచర్ అచ్చం క్వికర్, ఓఎల్‌ఎక్స్ లాగే పనిచేస్తుంది. అందులో యూజర్లు తాము అమ్మాలనుకునే వస్తువులను కేటగిరి వారీగా ఉండే పేజీల్లో పెట్టవచ్చు. వాటిని సందర్శించే మరో యూజర్ అవసరం అనుకుంటే కొనుగోలు చేస్తాడు. ఎలాగూ యూజర్లు ఫేస్‌బుక్‌లోనే ఉంటారు కనుక అందులో ఉంటే చాటింగ్ ద్వారా వారు తమకు గిట్టుబాటు అయ్యే ధరకు వస్తువులను అమ్మడమో, కొనడమో చేస్తారు. దీంతో ఇద్దరికీ లాభం ఉంటుంది. అయితే పేమెంట్, డెలివరీ తదితర అంశాల్లో మాత్రం ఫేస్‌బుక్ కల్పించుకోదు. వాటిని అమ్మేవారు, కొనేవారు మాత్రమే సెట్ చేసుకోవాలి. ఫేస్‌బుక్ కేవలం ఇద్దరికీ మధ్య వర్తిగా మాత్రమే ఉంటుంది. త్వరలో ఈ మార్కెట్ ప్లేస్ ఫీచర్ ఫేస్‌బుక్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

5271

More News

VIRAL NEWS