అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్.. భారీ తగ్గింపు ధరలకు ఫోన్లు..!


Mon,June 10, 2019 05:21 PM

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఇవాళ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా భారీ డిస్‌ప్లే ఉన్న ఫోన్లతోపాటు పలు యాక్ససరీలపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ X రూ.23,991 తగ్గింపు ధరతో రూ.67,999 ధరకు లభిస్తున్నది. అలాగే ఐఫోన్ XR (64జీబీ) రూ.58,999 ధరకు (రూ.17,901 తగ్గింపు), వన్‌ప్లస్ 6టి మెక్‌లారెన్ లిమిటెడ్ ఎడిషన్ రూ.41,999 (రూ.9వేలు తగ్గింపు) ధరకు, హానర్ వ్యూ 20 రూ.35,999 (రూ.6వేలు తగ్గింపు) ధరకు, హానర్ ప్లే (6జీబీ+64జీబీ) రూ.15,999 (రూ.10వేలు తగ్గింపు) ధరకు లభిస్తున్నాయి. అలాగే హానర్ 8ఎక్స్, షియోమీ ఎంఐ ఎ2, రియల్‌మి యు1, హానర్ 8సి ఫోన్లతోపాటు హెడ్‌ఫోన్స్, పవర్ బ్యాంకులు, చార్జింగ్ కేబుల్స్, సెల్ఫీ స్టిక్స్, మొబైల్ కేసెస్, కవర్లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ఇక ఈ సేల్ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

2980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles