డీజేఐ ఒస్మో యాక్ష‌న్ వాటర్‌ప్రూఫ్ యాక్ష‌న్ కెమెరా విడుద‌ల


Thu,May 16, 2019 05:39 PM

డీజేఐ కంపెనీ ఒస్మో యాక్ష‌న్ పేరిట ఓ నూత‌న వాట‌ర్‌ప్రూఫ్ యాక్ష‌న్ కెమెరాను ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో 4కె వీడియో రికార్డింగ్‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. దీంతో 4కె రిజ‌ల్యూషన్‌తో వీడియోల‌ను షూట్ చేసుకోవ‌చ్చు. అలాగే ఈ కెమెరాలో 12 మెగాపిక్స‌ల్ కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీంతో నాణ్య‌మైన ఫొటోల‌ను కూడా తీసుకోవ‌చ్చు. ఈ కెమెరా కేవ‌లం 124 గ్రాముల బ‌రువు మాత్ర‌మే ఉంటుంది. ఇందులో 1300 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని అమ‌ర్చారు. వాట‌ర్‌ప్రూఫ్ బాడీ అమ‌ర్చినందున నీటి నుంచి ఈ కెమెరాకు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే ఈ కెమెరాను వైఫై లేదా బ్లూటూత్ ద్వారా ఇత‌ర డివైస్‌ల‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ కెమెరా రూ.24,500 ధ‌రకు ఈ నెల 22వ తేదీ నుంచి వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles