ఫోన్‌లో నోటిఫికేషన్ డిలీట్ చేశారా..? ఇలా పొందండి..!


Sun,November 19, 2017 07:30 PM

మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతున్నారా ? మీకు ఏదైనా యాప్ నుంచి వ‌చ్చిన‌ నోటిఫికేషన్‌ను అనుకోకుండా డిలీట్ చేశారా ? అయితే ఏం ఫర్వాలేదు. ఎందుకంటే 'నోటిఫికేషన్ హిస్టరీ లాగ్ (Notification History Log)' అనే యాప్‌ను మీ ఫోన్‌లో వేసుకుంటే దాంతో మీరు డిలీట్ చేసిన నోటిఫికేషన్‌ను కూడా ఈ యాప్‌లో చూడవచ్చు. అంతేకాదు, డివైస్‌లో ఆయా యాప్‌ల నుంచి వచ్చిన పాత నోటిఫికేషన్లను కూడా ఈ యాప్‌లో చూడవచ్చు. ఈ యాప్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తున్నది. దీన్ని ఆండ్రాయిడ్ 4.1 ఆపైన వెర్షన్ ఉన్న ఫోన్లలో యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకుని వాడవచ్చు..!

2982

More News

VIRAL NEWS