కూల్‌ప్యాడ్ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ విడుదల


Mon,October 15, 2018 03:36 PM

మొబైల్స్ తయారీదారు కూల్‌ప్యాడ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోట్ 8 ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో 5.99 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు. రూ.9,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా పేటీఎం మాల్‌లో లభిస్తున్నది.

కూల్‌ప్యాడ్ నోట్ 8 ఫీచర్లు...


5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 0.3 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1386

More News

VIRAL NEWS

Featured Articles