రూ.5,999కే క్లౌడ్‌ వాకర్‌ సౌండ్‌ బార్‌


Tue,January 14, 2020 03:49 PM

కన్‌జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు క్లౌడ్‌ వాకర్‌.. బరస్ట్‌ లైనప్‌లో ఐ2000, ఇ3000 పేరిట నూతన సౌండ్‌ బార్‌లను భారత్‌లో విడుదల చేసింది. వీటిని బ్లూటూత్‌ 5.0 ద్వారా ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. 11 భిన్నమైన ఎల్‌ఈడీ ఎఫెక్ట్స్‌ ఫీచర్‌ను వీటిలో అందిస్తున్నారు. ఐ2000 స్పీకర్‌లో 2.1 చానల్‌ స్పీకర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 25 వాట్ల సామర్థ్యం ఉన్న రెండు స్పీకర్లను అమర్చారు. ఇవి పవర్‌ఫుల్‌ బేస్‌ను ఇస్తాయి. ఆక్స్‌-ఇన్‌, లైన్‌ ఇన్‌, ఆప్టికల్‌ పోర్టు ద్వారా కూడా ఈ సౌండ్‌బార్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇక ఇ3000 సౌండ్‌బార్‌లో 2.1 చానల్‌ స్పీకర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 50 వాట్ల సామర్థ్యం ఉన్న రెండు స్పీకర్లు ఉన్నాయి. అలాగే 60 వాట్ల సామర్థ్యం ఉన్న సబ్‌ వూఫర్‌ కూడా ఇందులో ఉంది. ఈ సౌండ్‌బార్‌ను కూడా ఆక్స్‌ ఇన్‌, లైనిన్‌, ఆప్టికల్‌ పోర్టు ద్వారా ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. బరస్ట్‌ ఐ2000 సౌండ్‌బార్‌ ధర రూ.5999 ఉండగా బరస్ట్‌ ఇ3000 సౌండ్‌ బార్‌ ధర రూ.7,999గా ఉంది.

758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles