యాపిల్ మ్యూజిక్‌, హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ల‌పై సిటీబ్యాంక్ 100 శాతం క్యాష్ బ్యాక్


Thu,April 12, 2018 01:08 PM

యాపిల్ మ్యూజిక్‌, హాట్‌స్టార్ యాప్‌ల‌లో మొద‌టిసారి స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకునే వినియోగ‌దారుల‌కు సిటీ బ్యాంక్ 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్న‌ది. ఆయా యాప్‌ల‌లో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి మొద‌టి సారిగా స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే యూజ‌ర్ల‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసిన‌ప్పుడు అయిన మొత్తం సొమ్ము క్యాష్‌బ్యాక్ రూపంలో వెన‌క్కి వ‌స్తుంది. స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్న 90 రోజుల్ల‌గా ఆ న‌గ‌దు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాలో జ‌మ అవుతుంద‌ని సిటీ బ్యాంక్ వెల్ల‌డించింది. అయితే క్యాష్‌బ్యాక్ పొందాలంటే యాపిల్ మ్యూజిక్‌లో క‌నీసం 3 నెల‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను తీసుకోవాలి. దీంతో మొద‌టి సారి యాపిల్ మ్యూజిక్ కు స‌బ్‌స్క్రైబ్ అయినందుకు మ‌రో 3 నెల‌ల ఉచిత స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. దీంతో 6 నెల‌ల వ‌ర‌కు యాపిల్ మ్యూజిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. అలాగే హాట్‌స్టార్‌లో నెల‌వారీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను తీసుకుంటే క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.

1746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles