'హువావై ఈజ్ గుడ్.. హువావై ఈజ్ బ్యూటిఫుల్': వీడియో


Fri,March 1, 2019 06:09 PM

బీజింగ్: అమెరికా, చైనా మధ్య వాణిజ్య, సాంకేతిక వైరం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం ఆర్థిక, సాంకేతిక, సైనిక రంగాల్లో అమెరికాకు తిరుగులేని ఆధిక్యం ఉన్నా చైనా క్రమక్రమంగా అగ్రస్థానానికి ఎగబాకుతోంది. చైనాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ సంస్థ హువావై 5జీ సాంకేతికతలో అగ్రస్థానం కోసం దూసుకుపోతోంది. టెలీ కమ్యూనికేషన్స్ పరికరాలను హువావై తయారు చేస్తోంది. అనేక దేశాల్లో 5జీ నెట్‌వర్క్‌లను విస్తృతంగా నిర్మిస్తోంది. ప్రస్తుత 4జీ నెట్‌వర్క్‌లకన్నా 50 నుంచి 100రెట్లు ఎక్కువ వేగంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే టెక్నాలజీ సామర్థ్యం 5జీ సొంతం.

హువావై ఐరోపాలనే ఎక్కువగా 5జీని విస్తరిస్తోంది. సాంకేతిక సాయంతో రక్షణ రహస్యాలను చైనా చోరీ చేస్తుందని, అది జాతీయ భద్రతకు ముప్పుతెస్తుందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి చైనా ప్రజలు వినూత్నంగా హువావై బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. అమెరికా కంపెనీ యాపిల్ గ్యాడ్జెట్స్‌ను చైనా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిషేధించారు. వాటి స్థానంలో హువావై పరికరాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హువావై ఈజ్ బ్యూటిఫుల్ వీడియో చైనీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది స్కూల్ విద్యార్థులు హువావై ఈజ్ గుడ్.. హువావై ఈజ్ బ్యూటిఫుల్ అంటూ సాంగ్ పాడుతూ అలరించారు.

2313

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles