రోజువారి పెట్రో రేట్ల‌ను ఆన్ లైన్ లో తెలుసుకోండిలా!


Fri,June 16, 2017 05:50 PM

జూన్ 16 అంటే ఈ రోజు నుంచి రోజూ పెట్రో ధ‌ర‌లు మారుతుంటాయి. ఒక పెట్రోల్ పంపు కు మ‌రో పెట్రోల్ పంపు మ‌ధ్య కూడా ధ‌ర‌ల వ్య‌త్యాసం ఉంటుంది. ప్ర‌తి రోజు ఉద‌యం 6 గంట‌ల‌కు ధ‌ర‌లు మార‌నున్నాయి. మ‌రి.. రోజూ మారే పెట్రో ధ‌ర‌లు తెలుసుకోవడం ఎలా అని చింతించ‌కండి. సింపుల్ గా ఒక్క క్లిక్ తో రోజూవారి పెట్రో ధ‌ర‌లు మీ మొబైల్ లో చూసుకొనే అవ‌కాశం ఉంది.

1. Fuel@IOC యాప్ఇది ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ యాప్. మీరున్న సిటీలో లైవ్ లో పెట్రో ధ‌ర‌ల‌ను తెలుసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఓఎస్ ల‌లో ఈ యాప్ ప‌నిచేస్తుంది. యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న త‌ర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక‌.. Locate Us అనే ఆప్ష‌న్ ను క్లిక్ చేస్తే అది గూగుల్ మ్యాప్ ద్వారా ద‌గ్గ‌ర్లో ఉన్న పెట్రోల్ పంపులను చూపిస్తుంది. అప్పుడు పెట్రోల్ పంపుల రోజూవారి ధ‌ర‌ల‌ను కూడా తెలుసుకోవ‌చ్చు.

2. SmartDrive యాప్ఇది బీపీసీఎల్..భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ యాప్. ఈ యాప్ ద్వారా కూడా రోజు వారి పెట్రో ధ‌ర‌ల‌ను తెలుసుకోవ‌చ్చు. రోజూ వారి పెట్రో ధ‌ర‌లే కాకుండా.. ద‌గ్గ‌ర్లో ఉన్న పెట్రోల్ పంపులను చూపిస్తుంది ఈ యాప్. ఆఫ‌ర్ జోన్ అనే ఓ ఫీచ‌ర్ ద్వారా పెట్రో స్మార్ట్ కార్డ్ తో కూడా ఈ యాప్ ను అనుసంధానం చేసుకోవ‌చ్చు.

2. ఎస్ఎంఎస్ఓ ఎస్ఎంఎస్ పంపించి కూడా పెట్రో ధ‌ర‌ల‌ను తెలుసుకోవ‌చ్చు. RSP DEALER CODE అని టైప్ చేసి 92249-92249 అనే నెంబ‌ర్ కు మెసేజ్ పంపిస్తే చాలు. భార‌త్ పెట్రోలియం ధ‌ర‌ల కోసం.. RSP DEALER CODE అని టైప్ చేసి 9223112222 కు మెసేజ్ పంపించాలి. హిందుస్థాన్ పెట్రోలియం అయితే.. RSP DEALER CODE అని టైప్ చేసి 9222201122 పంపిస్తే చాలు. మీకు పెట్రో ధ‌ర‌ల‌కు సంబంధించిన వివ‌రాలు వాళ్లే మెసేజ్ పంపిస్తారు.

4.IOCL, BPCL, HP వెబ్ సైట్స్ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ వెబ్ సైట్ www.iocl.com కి వెళ్లి రోజూ వారి ధ‌ర‌లు చెక్ చేయ‌వ‌చ్చు. Check fuel prices అనే ఆప్ష‌న్ వెబ్ సైట్ లో ఉంటుంది. ఆ ఆప్ష‌న్ ను క్లిక్ చేస్తే చాలు. హిందూస్థాన్, భార‌త్ పెట్రోలియం ధ‌ర‌ల కోసం... ఈ లింకుల‌ను క్లిక్ చేస్తే చాలు. https://www.bharatpetroleum.in/index.aspx, https://www.bharatpetroleum.com/index.aspx

7150

More News

VIRAL NEWS