అచ్చం పబ్‌జి మొబైల్‌లాగే.. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ వచ్చేసింది..!


Tue,October 1, 2019 11:42 AM

పబ్‌జి ప్రేమికులకు శుభవార్త. వారంతా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్ వచ్చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఈ గేమ్ ఇవాళ అందుబాటులోకి వచ్చింది. దీన్ని గేమింగ్ ప్రియులు ప్రస్తుతం తమ తమ డివైస్‌లలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కాగా కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్ అచ్చం పబ్‌జి మొబైల్ గేమ్‌ను పోలి ఉండడం విశేషం. ఇంకా చెప్పాలంటే.. పబ్‌జి కన్నా ఎక్కువగానే ఈ గేమ్‌లో అద్భుతమైన గ్రాఫిక్స్, ఇతర ఫీచర్లను అందిస్తున్నారు.

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్‌లో పబ్‌జి గేమ్ తరహాలోనే పలు రకాల మ్యాప్స్, వెపన్స్ ఉంటాయి. యూజర్ తనకు నచ్చిన క్యారెక్టర్‌ను కస్టమైజ్ చేసుకుని ఆడవచ్చు. ఫస్ట్ పర్సన్ మోడ్‌లో ఈ గేమ్ అద్భుతమైన యాక్షన్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. అలాగే పలు రకాల బ్యాటిల్ మోడ్‌లలో యూజర్ ఈ గేమ్‌ను ఆడవచ్చు. ఇక ఈ గేమ్‌ను ఆడాలంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లో అయితే కనీసం 1.2 గిగాహెడ్జ్ కలిగిన డ్యుయల్ కోర్ సీపీయూ, 1.5 జీబీ కనీస ర్యామ్, 15 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 4.3 ఆపైన ఓఎస్ వెర్షన్ కలిగి ఉండాలి. అదే ఐఫోన్‌లో అయితే ఐఫోన్ 7 ఆపైన వచ్చిన ఐఫోన్లు, ఐఓఎస్ 9 ఆపైన వెర్షన్ ఓఎస్ ఉండాలి. ఇక ఆండ్రాయిడ్‌లో 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8 ఆపైన వెర్షన్ ఓఎస్, ఐఫోన్ అయితే ఐఫోన్ 8 ఆపైన ఐఫోన్లలో ఈ గేమ్‌ను హై ఎండ్ గ్రాఫిక్స్‌లో ఎలాంటి ల్యాగ్ లేకుండా ఆడవచ్చు.

929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles