ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు సరికొత్త వెబ్ బ్రౌజర్..!


Mon,February 5, 2018 03:16 PM

ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లను వాడే యూజర్ల కోసం ఓ సరికొత్త ఇంటర్నెట్ బ్రౌజర్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. 'కేక్ వెబ్ బ్రౌజర్' పేరిట విడుదలైన ఈ ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు తమ తమ యాప్ స్టోర్స్ నుంచి ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్రౌజర్‌లో ఉండే అడ్రస్ బార్‌లో యూజర్లు ఏదైనా సెర్చ్ చేస్తే కింది భాగంలో రిజల్ట్స్ రావు. దానికి బదులుగా రిజల్ట్స్‌లో ఉండే మొదటి పేజీ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. అది వద్దనుకుంటే కుడి, ఎడమలకు స్క్రీన్‌పై స్వైప్ చేస్తే మరిన్ని సెర్చ్ రిజల్ట్స్ వెబ్‌సైట్‌లు ఓపెన్ అవుతాయి. ఈ తరహా స్వైప్ సెర్చ్ అవసరం లేదనుకుంటే సాధారణ సెర్చ్ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. అయితే యూజర్లు ఈ యాప్‌లో ముందుగా గూగుల్, బింగ్, యాహూ వంటి సెర్చ్ సైట్లలో ఏదో ఒక సైట్‌ను డిఫాల్ట్ సెర్చ్ సైట్‌గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.

కేక్ ఇంటర్నెట్ బ్రౌజర్‌లో మరిన్ని ఫీచర్లు కూడా యూజర్లకు లభిస్తున్నాయి. ఇందులో యూజర్లు తమకు కావల్సిన సమాచారాన్ని ఇమేజ్‌లు వీడియోలు, వార్తలు, షాపింగ్ తరహాలో కూడా వెదకవచ్చు. అలాగే పలు విభాగాల్లో సెర్చ్ చేసి అవసరం ఉన్న సమాచారాన్ని పొందవచ్చు. ఇందులో ఇన్‌బిల్ట్ యాడ్ బ్లాకర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వెబ్‌సైట్లలో విసుగు పుట్టించేలా దర్శనమిచ్చే యాడ్స్ యూజర్లకు కనిపించవు. అలాగే ప్రైవేట్ బ్రౌజింగ్, మల్టిపుల్ ట్యాబ్స్, బుక్‌మార్క్స్ వంటి కామన్ ఫీచర్లు కూడా కేక్ బ్రౌజర్‌లో లభిస్తున్నాయి.

2840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles