అతి త్వరలో ప్రారంభం కానున్న బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు..!


Tue,September 11, 2018 06:02 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన నెట్‌వర్క్‌లో 4జీ సేవలను అతి త్వరలో ప్రారంభించనుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ సేవలను ప్రారంభించేందుకు కావల్సిన అనుమతినిచ్చింది. 2100 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ తన 4జీ సేవలను ప్రారంభించనుంది. 2017లోనే ఇందుకు గాను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రాజెక్టు రిపోర్టును సబ్‌మిట్ చేయగా, ఇప్పుడు అందుకు ఆమోదం లభించింది. దీంతో త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ (ఎల్‌టీఈ) సేవలను ఆరంభించనుంది.

దేశీయ టెలికాం మార్కెట్‌లో ఇప్పటికే పలు ప్రైవేటు టెలికాం కంపెనీలు 4జీ సేవలను ప్రారంభించి చాలా రోజులవుతుండగా, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉండిపోయింది. అయితే తాజాగా లభించిన అనుమతితో త్వరలో దేశంలోని 21 సర్కిళ్లలో బీఎస్‌ఎన్‌ఎల్ తన 4జీ సేవలను ప్రారంభిస్తుంది. కేరళ, కర్ణాటకలలోని పలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే 4జీ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో డాట్ నుంచి వచ్చిన అనుమతి వల్ల దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు కస్టమర్లకు లభ్యం కానున్నాయి.

3403

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles