జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్..!


Sat,May 5, 2018 02:01 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జియోకు పోటీగా రూ.349కు ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 54 రోజులుగా నిర్ణయించారు. దీంతో మొత్తం 54 రోజులకు గాను రోజుకు 1జీబీ డేటా చొప్పున 54 జీబీ డేటా కస్టమర్లకు లభిస్తుంది. ఇక జియోలో ఇదే ప్లాన్ రూ.349కే అదే ధరలో అందుబాటులో ఉండగా ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. కాకపోతే ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులుగా ఉంది. దీంతో 70 రోజులకు కలిపి మొత్తం 105 జీబీ డేటా కస్టమర్లకు వస్తుంది. ఈ క్రమంలోనే ఈ ప్లాన్‌కు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ సదరు నూతన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

6109

More News

VIRAL NEWS