రూ.75తో 10జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్


Sat,July 28, 2018 05:58 PM

ముంబయి: మార్కెట్‌లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ , వొడాఫోన్‌ ఆఫర్లకు అనుగుణంగా మరో ప్లాన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.75 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 10జీబీ(2జీ/3జీ) డేటా, 500 ఎస్సెమ్మెస్‌లను మొబైల్ వినియోగదారులు వినియోగించుకోవచ్చు. ఐతే ఈ ప్లాన్ వాలిడిటీ 15 రోజులు మాత్రమే. యూజర్లు ఈ ఆఫర్‌ను 180 రోజుల వరకు పొడిగించుకునే వీలుందని సంస్థ తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్ జీవిత ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా రూ.75 రీఛార్జ్ ఆఫర్ తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉండనుంది.

కస్టమర్లు రూ.98, రూ99, రూ.118, రూ.139, రూ.187, రూ.198, రూ.319, రూ.333, రూ.349, రూ.395, రూ.444, రూ.447, రూ.551లతో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు ఆ ఆఫర్లను ఉపయోగించుకునే వీలుంది. రూ.98, రూ.199తో ప్రత్యేక రీఛార్జ్ చేసుకుంటే రూ.75 ప్లాన్‌తో లభించే అన్ని ఆఫర్లను మరో 90రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు రీఛార్జ్‌ల కన్నా ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకుంటే 180 రోజుల వరకు ఈ ఆఫర్ వర్తించనుంది.

కొత్త ప్లాన్‌పై పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే కస్టమర్లు రీఛార్జ్ చేసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ సూచించింది. వారం క్రితం బీఎస్‌ఎన్‌ఎల్ ఒక స్పెషల్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.171 రీఛార్జ్‌తో ప్రతిరోజు 2జీబీ(2జీ/3జీ) డేటాతో పాటు అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ఆఫర్ కాలపరిమితి 30 రోజులు మాత్రమే.

6545

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles