రూ.349 ప్లాన్‌లో డేటా, వ్యాలిడిటీ పెంపు


Fri,February 22, 2019 12:24 PM

ముంబై: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని మార్కెట్లో నిలబడేందుకు ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్లాన్లలో మార్పులు చేసింది. రూ.349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో ప్రతిరోజూ 1 జీబీ డేటా, 54రోజుల వ్యాలిడిటీ ఉండేది. కస్టమర్ల కోసం అదనపు డేటా, వ్యాలిడిటీ గడువు పెంచుతూ ఆఫర్‌లో తాజాగా స్వల్ప మార్పులు చేసింది.

రూ.349తో రీఛార్జ్ చేసుకుంటే ఇకపై 64రోజుల పాటు ఆఫర్ వర్తించనుంది. ఆఫర్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 100 ఎస్సెమ్మెస్‌లు వినియోగదారులు పొందేవీలుంది. ఇకపై రోజుకు 3.2జీబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చు. ఇందులో 2.2జీబీ డేటాను అదనంగా ఇవ్వనున్నారు. ప్లాన్ కింద మొత్తం 64 రోజులకు 204.8జీబీ డేటాను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో యూజర్లకు రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తున్న విషయం తెలిసిందే.

3495

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles