బీఎస్‌ఎన్‌ఎల్ రక్షాబంధన్ ఆఫర్.. ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్త ప్లాన్..!


Sat,August 25, 2018 06:06 PM

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఓ నూతన ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. రూ.399 పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌ను కస్టమర్లు రీచార్జి చేసుకుంటే వారికి అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 74 రోజులుగా నిర్ణయించారు. ఢిల్లీ, ముంబై సర్కిల్స్‌లో ఉంటున్న కస్టమర్లకు కూడా ఈ ప్లాన్ వర్తిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. రాఖీ పండుగ సందర్భంగా ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టామని, రేపటి నుంచి ఈ ప్లాన్‌ను కస్టమర్లు రీచార్జి చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారి ఒకరు చెప్పారు.

6847

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles