బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ డేటా..!


Sat,June 30, 2018 02:22 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అందులో పలు ప్లాన్లకు గాను అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.99 నుంచి రూ.1525 వరకు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉండగా వాటిల్లో అందించే ఉచిత మొబైల్ డేటా అయిపోనా కస్టమర్ల ఇంటర్నెట్‌ను పొందవచ్చు. కాకపోతే ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఇలా కస్టమర్లు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.99 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో నెలకు 500 ఎంబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.399 ప్లాన్‌లో 30 జీబీ డేటా వస్తుంది. దీంతోపాటు రూ.799, రూ.1125, రూ.1525 ప్లాన్లలోనూ ప్లాన్ రెంటల్‌కు అనుగుణంగా ఉచిత డేటాను అందిస్తున్నారు.

2264

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles