ఇంట్లో బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్ ఉందా? అయితే ఫ్రీ బ్రాడ్‌బాండ్.. రోజుకు 5 జీబీ డేటా


Sat,March 16, 2019 05:14 PM

మీ ఇంట్లో బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్ ఉంటే.. బీఎస్‌ఎన్‌ఎల్ మీకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. అదే ఫ్రీ బ్రాడ్‌బాండ్. అవును.. ఇది కేవలం బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్ కస్టమర్లకు మాత్రమే. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ స్కీమ్‌ను పొందాలంటే.. బీఎస్‌ఎన్‌ఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 18003451504 నెంబర్‌కు తమ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.

బ్రాడ్‌బాండ్ కనెక్షన్ కోసం కస్టమర్లు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొన్నది. ఈ ఆఫర్ కింద.. రోజుకు 5జీబీ డేటా(10ఎంబీపీఎస్ స్పీడ్ వరకు) ఉపయోగించుకోవచ్చు.

ఇదివరకే బ్రాడ్‌బాండ్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్లకు 25 శాతం క్యాష్‌బాక్, ఒక సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్సన్ అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. ఫ్రీ బ్రాడ్‌బాండ్‌తో పాటు ఫ్రీ వాయిస్ కాలింగ్ అనే ఆఫర్‌ను తన లాండ్‌లైన్, లాండ్‌లైన్ బ్రాడ్‌బాండ్, మొబైల్ కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. ఈ సర్వీసును కంపెనీ వింగ్స్ వీవోఐపీ అనే ప్లాట్‌ఫాం ద్వారా పొందొచ్చు.

వింగ్స్ ప్లాట్‌ఫాంతో ప్రపంచంలో ఎక్కడైనా ఇన్‌కమింగ్ కాల్స్‌కు రోమింగ్ ఉచితంగా ఉంటుంది. ఔట్‌గోయింగ్ కాల్స్‌కు అయితే.. నిమిషానికి 1.20 రూపాయలను బీఎస్‌ఎన్‌ఎల్ చార్జ్ చేస్తుంది. అది కూడా యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి ఇండియాకు చేసే కాల్స్‌కే రూ.1.20 ను చార్జ్ చేయనుంది. వింగ్స్ ప్లాట్‌ఫాం ద్వారా ఇంటర్నేషనల్ కాలింగ్ సరసమైన ధరలో అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.

బీఎస్ఎన్ఎల్‌కు పోటీగా.. ఐడియా నిర్వాన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు వొడాఫోన్, ఐడియా.. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందాలంటే 999 రూపాయలు కట్టాల్సి ఉంది. ఆ డబ్బులను వొడాఫోన్, ఐడియా కంపెనీలు కట్టి.. తమ కస్టమర్లకు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నాయి. ఐడియా నిర్వాన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రకారం.. 399 రూపాయలు.. అంతకంటే ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఉన్నవాళ్లు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు అర్హులు. వొడాఫోన్ సపరేట్‌గా తన రెడ్ సబ్‌స్ర్కైబర్స్‌కు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్న విష‌యం తెలిసిందే.

5486

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles