బీఎస్ఎన్ఎల్ భార‌త్ ఫైబ‌ర్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్‌


Tue,February 12, 2019 07:39 PM

ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త‌న భార‌త్ ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. ఆ సేవ‌లను వాడుతున్న వినియోగ‌దారుల‌కు రూ.999 విలువ గ‌ల ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్న‌ట్లు ఆ సంస్థ ఇవాళ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ క్ర‌మంలోనే భార‌త్ ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.777 ఆపైన ప్లాన్‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే వినియోగ‌దారులు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles