కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్.. ఉచితంగా 1జీబీ డేటా..!


Thu,November 29, 2018 11:44 AM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన మొబైల్ కస్టమర్లకు ఓ నూతన ఆఫర్‌ను ప్రకటించింది. అందులో భాగంగా వినియోగదారులు తమ తమ స్మార్ట్‌ఫోన్లలో మై బీఎస్‌ఎన్‌ఎల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారికి 1జీబీ డేటా ఉచితంగా వస్తుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ప్లే స్టోర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ లభిస్తుంది.

2695
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles