రూ.171 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్


Sun,August 5, 2018 11:13 AM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.171 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్నారు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 30 రోజులుగా నిర్ణయించారు. జియోలో రూ.198 ప్లాన్‌లో దాదాపుగా ఇదే తరహా బెనిఫిట్స్‌ను అందిస్తున్నారు. కాకపోతే ఆ ప్లాన్ వాలిడిటీ కొన్ని రోజులు తక్కువగా ఉంది. రూ.198 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌కు పోటీగానే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.171 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

3334

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles