రూ.149 కే రోజూ 4జీబీ డేటా.. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్..!


Sat,June 16, 2018 06:35 PM

రిలయన్స్ జియో ఇటీవలే తన కస్టమర్లందరికీ డబుల్ ధమాకా ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ ఆఫర్ కింద రోజువారీ డేటా లిమిట్ ప్లాన్లను వాడే వారికి రోజూ 1.5 జీబీ అదనపు డేటాను ఈ నెల మొత్తం ఉచితంగా అందిస్తున్నది. అయితే జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా రూ.149 ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు రీచార్జి చేసుకుంటే వారికి 28 రోజుల పాటు రోజుకు 4జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను అందించడం లేదు. ఇక ప్రస్తుతం జరుగుతున్న సాకర్ వరల్డ్ కప్ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ స్పెషల్ డేటా ఎస్‌టీవీ పేరిట బీఎస్‌ఎన్‌ఎల్ ఈ రూ.149 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

4694

More News

VIRAL NEWS