జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్


Tue,February 27, 2018 07:57 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జియోకు పోటీగా రూ.448కు ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా లాంచ్ చేసింది. రూ.448 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 1జీబీ మొబైల్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ లభిస్తాయి. ఇక ఈ ప్లాన్‌కు వాలిడిటీ 84 రోజులుగా నిర్ణయించారు. జియోలో ఇదే ప్లాన్ రూ.449కు లభిస్తుండగా అందులో వినియోగదారులకు రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 91 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌కు పోటీగానే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.448 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

7757

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles