బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ రాఖీ ఆఫర్..!


Thu,August 3, 2017 12:27 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన మొబైల్ యూజర్లకు రాఖీ పండుగ సందర్భంగా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రాఖీ పే సౌగాత్ పేరిట ఈ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్నది. దీనికి గాను యూజర్లు రూ.74 తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. వారికి 5 రోజుల పాటు అన్‌లిమిటెడ్ ఆన్ నెట్ కాల్స్ వస్తాయి. దీంతోపాటు రూ.74 టాక్ టైం, 1 జీబీ ఫ్రీ డేటా లభిస్తుంది. ఇక బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు రూ.189, రూ.289, రూ.389 పేరిట కొత్త ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది. వీటికి ఇచ్చే డేటాతోపాటు మరో 1 జీబీ అదనపు డేటాను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్నది.

2690

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles