రూ.777కే 500జీబీ డేటా.. బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కొత్త ప్లాన్..!


Sat,June 9, 2018 02:46 PM

రిలయన్స్ జియోకు చెందిన బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు కానీ.. అంతకు ముందుగానే బీఎస్‌ఎన్‌ఎల్ ఆకట్టుకునే ప్లాన్లను ప్రవేశపెడుతూ నూతన కస్టమర్లను ఆకర్షించడమే కాదు, ఉన్న కస్టమర్లను పోకుండా చూసుకుంటున్నది. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్ నూతనంగా పలు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను బాగానే ప్రవేశపెట్టింది. ఇక తాజాగా రూ.777 కే మరో నూతన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ లాంచ్ చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఎఫ్‌టీటీహెచ్ (ఫైబర్ టు ది హోమ్) బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను వాడేవారి కోసం ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

రూ.777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు 500 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. 500 జీబీ ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 50 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 2 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది. అలాగే రూ.1277 కు మరో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 30 రోజులకు గాను 750 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. దీంట్లో ఉచిత డేటా అయిపోగానే స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుంచి 2 ఎంపీబీఎస్ కు పడిపోతుంది. ఈ రెండు ప్లాన్లు ఫైబ్రో కాంబో యూఎల్‌డీ పేరిట లభిస్తున్నాయి.

3410

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles